వినాయక చవితి ఉత్సవాలపై శాంతి సమావేశం

మామునూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో బుధవారం శాంతి సమావేశం నిర్వహించారు. వివిధ మండలాలు, వర్గాలు, సమాజాలకు చెందిన సుమారు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ శ్రీ అనికేత్ కుమార్, మామునూర్ ఏసీపీ శ్రీ ఎన్. వెంకటేష్ పాల్గొని ఉత్సవాల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
గత ఏడాది మామునూర్ పరిధిలో సుమారు 830 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినప్పటికీ, అన్ని వర్గాల ప్రజలు పోలీసులకు సహకరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో పరస్పర సహకారం, సమన్వయం, సోదరభావంతో వేడుకలు నిర్వహించాలని కోరారు.
వినాయక మండపాల నిర్వాహకులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సంబంధిత శాఖల అనుమతులు పొందిన అనంతరం మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేయాలని సూచించారు. లౌడ్‌స్పీకర్ల వినియోగం, ట్రాఫిక్‌ నియంత్రణ, విద్యుత్‌ భద్రత, నిమజ్జన మార్గాలు, సమయాల విషయంలో పోలీసుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మామునూర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐలు నిస్సార్, హరిశంకర్, గీసుకొండ ఇన్‌స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్‌ఐ కుమార్, ఇనవోలు ఎస్‌ఐ అశోక్, పర్వతగిరి ఎస్‌ఐ ప్రవీణ్, ఎనుమాముల ఎస్‌ఐ రాజు, సంగెం ఎస్‌ఐ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యువత, ఉత్సవ కమిటీలు పోలీసులతో సమన్వయం చేసుకుని శాంతి, మత సామరస్యాన్ని కాపాడాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

You may also like...