కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన
- ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలి, సీఈఓ సుదర్శన్‌రెడ్డి - September 2, 2026
- ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ వర్ధంతి వేడుకలు - September 2, 2026
- తెలంగాణ టెట్ హాల్ టికెట్స్ విడుదల - September 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా 420 అడుగుల భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు రైతులు యువత మహిళలు నిరుద్యోగులు పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు ఈ ధర్నా కార్యక్రమంతో
మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్, రాంబాల్ నాయక్,వంకాయల నారాయణరెడ్డి,మాజీ కౌన్సిలర్ జూపల్లి శంకర్,బి ఆర్ఎస్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ,కొందుర్గు వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్,మసుదన్ రావు, సర్పంచులు,మాజీ సర్పంచ్ సత్తయ్య, గుండు సురేష్,గుండు నరసింహ,అశోక్,బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

