నీళ్ల పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు: అనిల్ కుమార్

53e29b1e-36de-4d81-a128-4e1293be4991.jpeg

దేవరుప్పుల: బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మాని అభివృద్ధిపై మాట్లాడాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దావెరా అనిల్ కుమార్ అన్నారు. పాలకుర్తి రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని, చెన్నూరు రిజర్వాయర్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఎస్సారెస్పీ కాలువల మరమ్మతులతో రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

You may also like...