ముదిరాజ్‌లకు న్యాయం ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత శేఖర్ ముదిరాజ్ ఫైర్.
- ముదిరాజ్‌లకు న్యాయం ఎప్పుడు? కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత శేఖర్ ముదిరాజ్ ఫైర్. - October 24, 2026
- మణికొండలో మితిమీరిన బహిరంగ మద్యపానం..అమృత్ వైన్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మణికొండ వాసుల డిమాండ్. - October 24, 2026
- రాజధాని రణభేరి సభ, సుర్వేష్ ముదిరాజ్ నేతృత్వంలో భారీగా తరలిన రాజేంద్రనగర్ ప్రజానీకం - October 24, 2026

రాజేంద్రనగర్: ముదిరాజ్ సామాజిక వర్గ సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఉపన్యాసాలకే పరిమితం కాకుండా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు, కిస్మత్పూర్ మాజీ ఉపసర్పంచ్ నీరుడు శేఖర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.
ముదిరాజ్‌లను వెంటనే బీసీ-డీ (BC-D) కేటగిరీ నుండి బీసీ-ఏ (BC-A) లోకి మారుస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు.
కామారెడ్డి డిక్లరేషన్‌ను తూచా తప్పకుండా అమలు చేయాలని, అలాగే హైదరాబాద్‌లో పండుగ సాయన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న హామీని నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డిని గట్టిగా డిమాండ్ చేశారు. ముదిరాజ్ హక్కుల సాధన కోసం తమ పోరాటం ఆగేది లేదని స్పష్టం చేశారు.
