పీర్మాయ కుంట తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం

తాడ్వాయి: నందివాడ పల్లెగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పీర్మాయ కుంట తండాలో మెగావత్ జాగుర్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు లబ్ధిదారుడు, తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ జాదావు రేణుక గణపతి, పార్టీ అధ్యక్షుడు బానోత్ శ్రీను పండరి, నందివాడ సర్పంచ్ సంకు పోచయ్య, గ్రామ అధ్యక్షుడు కనగల్ల బాల్ సాయిలు, కార్యదర్శి రవికాంత్, సీనియర్ నాయకుడు బాబుసింగ్‌తో పాటు తండావాసులు పాల్గొన్నారు.

You may also like...