శ్రీశైలంలో సంకెపల్లి భక్తుల దుర్గామాల
- అమెరికాలో రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం - October 23, 2026
- శ్రీశైలంలో సంకెపల్లి భక్తుల దుర్గామాల - October 23, 2026
- సంకేపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజలు – ఘనంగా అన్నదాన కార్యక్రమం - October 18, 2026
శ్రీశైలంలో సంకెపల్లి భక్తుల దుర్గామాల విరమణ
సంకెపల్లి:
మండలంలోని సంకెపల్లి గ్రామంలో మొదటిసారిగా దుర్గామాత విగ్రహాన్ని అత్యంత వైభవంగా ప్రతిష్టించి, భక్తులు మాలలు ధరించి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రుల అనంతరం అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని శోభాయాత్రగా పూర్తి చేశారు.
అనంతరం సంకెపల్లికి చెందిన దుర్గామాత భక్తులు శ్రీశైలం క్షేత్రానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో మాల విరమణ చేశారు. శ్రీశైలం నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చిన భక్తులు, అమ్మవారికి సమర్పించిన ఒడి బియ్యాన్ని వండి గ్రామ ప్రజలకు, భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. మొదటిసారిగా నిర్వహించిన ఈ దేవీ నవరాత్రులు, మాల విరమణ మహోత్సవంలో గ్రామస్తులందరూ ఉత్సాహంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

