ఎమ్మెల్యే కసిరెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన..భరత్ గౌడ్
- ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి - October 20, 2026
- ఎమ్మెల్యే కసిరెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన..భరత్ గౌడ్ - October 20, 2026
- కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - October 19, 2026

వెల్దండ : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కల్వకుర్తిలో మంగళవారం డిసిసి అధ్యక్షులు భూపతిరెడ్డి, సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ల ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలసి దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా మాజీ అధ్యక్షులు బచ్చు రామకృష్ణ, నాయకులు కాసు శ్రీనివాస్ రెడ్డి,సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అలీ భాయ్, విశ్రాంత ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, సురేందర్ రెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
