విజయదశమి వేళ మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య
- విజయదశమి వేళ మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య - October 20, 2026
- సింగాపురం బైపాస్ రోడ్డు లోఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి - October 18, 2026
- రుతుక్రమ ఆరోగ్యంపై సుప్రీం ఆగ్రహం! - October 18, 2026

- కర్ణాటకలోని బుద్ధ విహార్లో మర్యాదపూర్వక భేటీ
- విజయదశమి సందర్భంగా ఆశీర్వాదాలు తీసుకున్న ప్రజాప్రతినిధులు
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు చేకూర్త గోపాల్ రెడ్డి
- ఆనంద్ రావు ఎర్ర, మాదోళ్ల మల్లికార్జున్, కావలి శేఖర్ హాజరు
- పండుగ వేళ ఆత్మీయంగా సాగిన నాయకుల సమావేశం
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటకలోని బుద్ధ విహార్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ చేకూర్త గోపాల్ రెడ్డి, శంకర్పల్లి మున్సిపాలిటీ మొదటి వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర, చెందిప్ప సర్పంచ్ మాదోళ్ల మల్లికార్జున్, తల్లారం గ్రామ సర్పంచ్ కావలి శేఖర్,డి ఆనంతి (5వ వార్డు మెంబెర్ చెందిప), ప్రభు గైక్వాడ్,జ్ఞాన తెలంగాణ పత్రిక ఎడిటర్ నల్లోళ్ల శ్రీకాంత్, తల్లారం బి నర్సింలు,ఏం డి అజీజ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకంగా, ఆత్మీయ వాతావరణంలో సాగింది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం, వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.





