తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి : మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేష్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 19 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఐక్యంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం సంతోషకరమని మునుకుంట్ల గ్రామ సర్పంచ్ గుల్లి నరేష్ అన్నారు. ఆదివారం రాత్రి గ్రామంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఉత్తమ బతుకమ్మలను పేర్చిన మహిళలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. పూలను అందంగా పేర్చి బతుకమ్మలను తయారు చేయడం, సామూహికంగా పాటలు పాడుతూ ఆటపాటలతో పండుగను జరుపుకోవడం మన ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు మహిళల్లో ఐక్యతను పెంపొందించడంతో పాటు, భావితరాలకు మన సంప్రదాయాలను పరిచయం చేస్తాయని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పండుగల ప్రాధాన్యతను పెంచుతూ, మహిళలను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకుంటూ, భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలను రూపొందించిన మహిళలకు బహుమతులు అందజేసి అభినందించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.1000383542.jpg

You may also like...