బొల్లంపల్లిలో భక్తి పారవశ్యం..వైభవంగా దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు
- కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - October 19, 2026
- దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. బీజేపీ నూతన బాధ్యులకు సన్మానం - October 19, 2026
- కల్వకుర్తి వాసవి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ రాక - October 19, 2026
వెల్దండ, అక్టోబర్ 18: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఆంజనేయస్వామి దేవాలయంలో,పాత బావి సమీపంలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ప్రత్యేక పూజల్లో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, మాజీ ఎంపీపీ పుట్ట రాంరెడ్డి,మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, జీయాగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.అనంతరం అన్నదాతలు రౌతు రామకృష్ణ, లోక పవన్, పోలోజు సాయికిరణ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పార్టీలకతీతంగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే వేదికపైకి రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దాతలను శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, మాజీ సర్పంచ్ ఉప్పు అపర్ణ తిరుమల రావు, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్,, స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
