చెక్క బతుకమ్మ వెనుక తరతరాల అనుబంధం!
- కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - October 19, 2026
- దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. బీజేపీ నూతన బాధ్యులకు సన్మానం - October 19, 2026
- కల్వకుర్తి వాసవి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ రాక - October 19, 2026

నాగర్ కర్నూల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో చెక్క బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉంది.తొలిసారి బతుకమ్మ పండుగ జరుపుకునే ఆడపిల్లలకు,వివాహం అనంతరం తొలిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు చెక్క బతుకమ్మను అందించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా అమ్మమ్మలు తమ మనవరాళ్లకు చెక్క బతుకమ్మతో పాటు పట్టు వస్త్రాలు, పిండి వంటలు, స్వీట్లు అందించి ఆశీర్వదిస్తారు. ఇది కేవలం బహుమతి మాత్రమే కాదు.. కుటుంబంలోని పెద్దల ప్రేమకు, ఆడపడుచుల ఆత్మీయతకు, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి ప్రతీక.తెలంగాణ సంస్కృతి భావితరాలకు చేరుతాయి. పూల బతుకమ్మల మధ్య చెక్క బతుకమ్మ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే ఆత్మీయ కానుకగా నిలుస్తోంది.
