ఎన్హెచ్ఎం ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి..సమ్మెకు ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు
- కౌన్సిలర్‌కు అండగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి - October 19, 2026
- దుర్గామాతకు ప్రత్యేక పూజలు.. బీజేపీ నూతన బాధ్యులకు సన్మానం - October 19, 2026
- కల్వకుర్తి వాసవి దేవాలయానికి ఉప్పల వెంకటేష్ రాక - October 19, 2026

నాగర్‌కర్నూల్: ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించి పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం సిబ్బంది చేపట్టిన నిరసనకు ఏఐటీయూసీ మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా నాయకులు బిజ్జా శ్రీనివాసులు, మారేడు శివశంకర్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన వైద్య సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల హామీ మేరకు క్రమబద్ధీకరించాలని కోరారు. పెండింగ్ జీతాలు, ఇంక్రిమెంట్లు చెల్లించడంతో పాటు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, కార్యదర్శి డాక్టర్ డి.కుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ జగన్, డాక్టర్ మహతి, డాక్టర్ సంధ్యారాణి, హైమావతి తదితరులు పాల్గొన్నారు.
