మాజీ ఎంపీటీసీ అనురాధకు కాంగ్రెస్ నేతల నివాళి

మాజీ ఎంపీటీసీ అనురాధకు కాంగ్రెస్ నేతల నివాళి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 16 : మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హైకోర్టు అడ్వకేట్ శేరి చత్రపతి సతీమణి అనురాధ ఇటీవల మృతి చెందింది. ఆమె దశదిన కార్యక్రమంలో శుక్రవారం బి ఎన్ గౌడ్ ఫంక్షనల్ లో జరిగింది. ఈ సందర్భంగా శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్ నేటి విద్యాసాగర్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ లు పాల్గొని అనురాధ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ్మ , కట్టంగూర్ సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ బొల్లా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీలు జెల్లా ముత్తిలింగం, రెడ్డిపల్లి సాగర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తండు అంజయ్య గౌడ్, కట్టంగూర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, కాంగ్రెస్ నాయకులు నర్సింగ్ దుర్గయ్య, మాజీ ఎంపీటీసీ సత్తయ్య, ఆకుల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.1000379708.jpg

You may also like...