డంపింగ్ యార్డు పొగతో నాలుగు గ్రామాల ప్రజలకు అవస్థలు!
- బాన్సువాడలో 31 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు - October 19, 2026
- డంపింగ్ యార్డు పొగతో నాలుగు గ్రామాల ప్రజలకు అవస్థలు! - October 19, 2026
- ఎస్సీ రోస్టర్లో మాలలకు అన్యాయం: అయ్యాల సంతోష్ - October 18, 2026

బాన్సువాడ పట్టణ మున్సిపాలిటీ చెత్తను మొగులాన్పల్లి తండా, దుంకుడు మోరి తండా, తిరుమలాపూర్, కొయ్యగుట్ట గ్రామాల మధ్య రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డులో వేస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్త నుంచి వెలువడే దుర్వాసన, చెత్తను కాల్చడం వల్ల వస్తున్న దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లాలన్నా, ఇళ్లలో ఉండాలన్నా దుర్వాసన, పొగతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. డంపింగ్ యార్డులో చెత్తను కాల్చకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, జనావాసాలకు దూరంగా ప్రత్యామ్నాయ స్థలాన్ని ఏర్పాటు చేయాలని, ప్రస్తుత డంపింగ్ యార్డును అక్కడి నుంచి తొలగించి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నాలుగు గ్రామాల ప్రజలు మున్సిపల్ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
