శంకర్‌పల్లి డిప్యూటీ MRO గా నూతన బాధ్యతలు స్వకరించిన కార్తీక్‌కు ఘన సన్మానం చేసిన బండమీది వెంకటేష్
- “ఆగకు…అడుగు వేయి…అడ్డంకులే నీకు మెట్లవుతాయి!నీ కలలే రేపటికొత్త ప్రపంచానికి నాంది.” - September 16, 2026
- గుంతలే గతి.. శంకర్‌పల్లి రోడ్లపై అధికారుల నిర్లక్ష్య పరాకాష్ట! - September 15, 2026
- అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం సమావేశం - September 15, 2026
శంకర్‌పల్లి డిప్యూటీ MRO గా నూతన బాధ్యతలు స్వకరించిన కార్తీక్‌కు ఘన సన్మానం చేసిన బండమేది వెంకటేష్
శంకర్‌పల్లి మండల డిప్యూటీ MROగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్తీక్ను బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు బండమీది వెంకటేష్ ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బండమీది వెంకటేష్ డిప్యూటీ MRO కార్తీక్‌కు భగవద్గీతను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా సేవలందించాలని ఆకాంక్షించారు.
శంకర్‌పల్లి మండలంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
డిప్యూటీ MRO కార్తీక్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
