దళిత స్పీకర్ ను అవమానించిన తాత మధు పై చర్యలు తీసుకోవాలి.. పుల్లయ్య
- పోచమ్మ బోనాలు విజయవంతం చేయండి.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - September 8, 2026
- దళిత స్పీకర్ ను అవమానించిన తాత మధు పై చర్యలు తీసుకోవాలి.. పుల్లయ్య - September 8, 2026
- రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ప్రజా హక్కులపై వినతి.. భారత రాష్ట్ర సమితి - September 8, 2026
వెల్దండ సెప్టెంబర్ 08 : దళిత స్పీకర్ ను అవమానించిన బీఆర్ఎస్ నేత తాత మధు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెల్దండ మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొయ్యల పుల్లయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత స్పీకర్ ను అవమానించడం దారుణమని, ఇది బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.తాత మధు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని, జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
