విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి
- సింగాపురం బైపాస్ రోడ్డు లోఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి - October 18, 2026
- రుతుక్రమ ఆరోగ్యంపై సుప్రీం ఆగ్రహం! - October 18, 2026
- ఓటర్ల జాబితాలపై కాంగ్రెస్ విజయం! - October 18, 2026

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ,ఎస్సీ,ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం వెల్దండ తహసిల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసి నాయకులు సైదులు మహారాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు 14 వేల కోట్ల పేజీ రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల అనేది ఆర్థిక సమస్య కాదని, పేద విద్యార్థుల చదువుకు సంబంధించిన సమస్యని, ఫీజు రియంబర్స్మెంట్ తో సంబంధం లేకుండా కాలేజీలు, పాఠశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లను ఇచ్చే విధంగా కొత్త జీవోను తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరాటే రాజు, కొప్పు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
