షాబాద్ మండలంలో చైన్ స్నాచింగ్ కలకలం
- దళిత స్పీకర్ను అవమానిస్తే సహించేది లేదు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - September 7, 2026
- అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు - September 7, 2026
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026

జ్ఞాన తెలంగాణ,షాబాద్,మే 07 :
షాబాద్ మండలంలోని మద్దూరు గేటు వద్ద మహిళ మెడలోని మంగళ సూత్రం ను గుర్తు తెలియని దుండగులు అపహరించిన ఘటన కలకలం రేపింది. షాబాద్ సిఐ కాంతా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… బుగ్గోని గూడ గ్రామనికి చెందిన భారతమ్మ రోడ్డుపై వెళ్తుండగా బైక్పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె మెడలోని మంగళ సూత్రం ను లాక్కొని పరారయ్యారు.ఈ ఘటనతో మహిళ భయాందోళనకు గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
