అక్రమంగా 22 పశువులను తరలిస్తున్న వాహనాలు పట్టివేత

మిడ్జిల్, సెప్టెంబర్ 22: మిడ్జిల్ మండల కేంద్రం మీదుగా అక్రమంగా తరలిస్తున్న నాలుగు బొలెరో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు వాహనాల్లో 22 పాడి ఆవులు, ఎద్దులు, కోడెలను తరలిస్తుండగా కల్వకుర్తికి చెందిన కౌన్సిలర్ వంశీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 167వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

వర్షాల వేల ప్రజల కోసం సేవ ముందస్తు చర్యలు

కోడేరు గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్‌ నడింపల్లి మహేశ్వర్‌రెడ్డి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పరిసరాలు, ఆర్‌ఎంపీ రోడ్డు పక్క ప్రాంతాలు, ఒడ్డేవాడ కాలనీలోని మోరీలు, డ్రైనేజీలను పరిశీలించి పేరుకుపోయిన మట్టి, చెత్తను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేలా అవసరమైన ప్రాంతాల్లో శుభ్రత పనులు చేపడుతున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్న సర్పంచ్‌ తీరుపై గ్రామస్థులు…

ఆమనగల్లులో వినాయక మండపంలో మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

ఆమనగల్లు, సెప్టెంబర్ 22: ఆమనగల్లు మున్సిపాలిటీ 9వ వార్డు పోస్ట్ ఆఫీస్ కాలనీలో బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం, సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్, కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, ఎర్రవోలు మహేష్, నాగిళ్ల జగన్, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ ఖాదర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు…

ఎల్ నినో ప్రభావం పై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నరసింహాం

ఆమనగల్‌: ప్రకృతి వైపరీత్యాలు, ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడిందనే కనీస అవగాహన లేకుండా బీఆర్‌ఎస్‌ నాయకులు విద్యుత్‌ సమస్యపై ధర్నాలు చేయడం హాస్యాస్పదమని ఆమనగల్‌ మార్కెట్‌ చైర్‌పర్సన్‌ యాట గీతా నరసింహం విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతులు ఎదుర్కొన్న విద్యుత్‌ సమస్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆమె ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోని…

త్రిదలన్ యూత్ గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సునేంద్ర కుమార్

నాగర్ కర్నూల్ పట్టణంలో త్రిదలన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ గణనాథుడి మండపాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ గారు కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులతో నాగర్ కర్నూల్ పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్ గారు,…

చారగొండ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ

చారగొండ: చారగొండ మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.రైతు వేదికలో జరిగిన ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.సమావేశంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచులు,…

మృతుని కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత

వెల్దండ: మండల పరిధిలోని కోట్ర గ్రామానికి చెందిన దుద్దుర్కు ఎల్లయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోట్ర గ్రామ టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ నీరటి రాములు ద్వారా సమాచారం అందడంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ స్పందించారు.మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.3,000 ఆర్థిక సహాయాన్ని ఎల్లయ్య భార్య లక్ష్మికి అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా…

మహా పాదయాత్రకు మద్దతుగా భారీగా తరలివస్తాం – ఎర్రవల్లి భూనిర్వాసితులు

295 రోజులకు చేరిన ఎర్రవల్లి భూ నిర్వాసితుల దీక్షలుమహా పాదయాత్రకు మద్దతుగా భారీగా తరలివస్తాం: భూ నిర్వాసితులుఎర్రవల్లి భూ నిర్వాసితుల ఆందోళన 295వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో దీక్షా స్థలంలో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు.ఈ నెల 27న ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు చేపట్టనున్న మహా పాదయాత్రకు సంబంధించి దీక్షా స్థలంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి భూ నిర్వాసితులు మాట్లాడుతూ…..

శుభకార్యాల సన్నాయి మేళం లాభాలు ఏంటో తెలుసా

శుభకార్యాల్లో సన్నాయి మేళం శాస్త్రీయ లాభాలు ఏంటో తెలుసుకుందాంనాగర్ కర్నూల్:శుభకార్యాల్లో సన్నాయి–డోలు మేళాన్ని మంగళ వాయిద్యంగా పిలుస్తారు. సన్నాయి నాదం శుభం, ఆనందానికి ప్రతీకగా భావిస్తూ, దేవతా అనుగ్రహం లభిస్తుందనే ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. పూర్వకాలంలో మైకులు లేని సమయంలో శుభకార్యం జరుగుతోందని గ్రామ ప్రజలకు తెలియజేయడానికి కూడా సన్నాయి నాదాన్ని ఉపయోగించేవారు. దీని గంభీరమైన ధ్వని వేడుకకు ఉత్సాహం, పండుగ వాతావరణాన్ని తీసుకువస్తుంది. అందుకే సన్నాయి మన సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.

ఎర్రవల్లి బాధితులకు అండగా జేఏసీ – ఉల్పర్ నుండి కల్వకుర్తి దాకా మహా పాదయాత్రకు పిలుపు

కల్వకుర్తి :ఎర్రవల్లి భూ నిర్వాసితుల నిరవధిక దీక్షలు 295వ రోజుకు చేరాయి.దీక్షా శిబిరానికి సంఘీభావంగా ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నాయకులు హాజరయ్యారు.ఈ నెల 27న ఉల్పర్ నుండి కల్వకుర్తి వరకు చేపట్టనున్న మహా పాదయాత్రకు సంబంధించి దీక్షా స్థలిలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహా పాదయాత్రకు బాధితులుగా పెద్ద ఎత్తున తరలివస్తామని ఎర్రవల్లి భూ నిర్వాసితులు తెలిపారు.అనంతరం అజిలాపూర్ మరియు ఇర్విన్ గ్రామాల్లో కూడా మహా పాదయాత్ర సన్నాహక…