అర్ధరాత్రి అరెస్టులతో విద్యార్థి నాయకులపై ఉక్కుపాదం – సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి: బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా
బాన్సువాడ, సెప్టెంబర్ 11: ఎలాంటి పిలుపు, కార్యక్రమం లేకపోయినా బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులను పోలీసులు అర్ధరాత్రి నుంచి అరెస్టులు చేయడం దారుణమని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబట్టి సాయిబాబా ఆరోపించారు. విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ అసహనానికి నిదర్శనమని విమర్శించారు.పోలీసులు అర్ధరాత్రి నుంచి విద్యార్థి నాయకుల ఇళ్లకు వెళ్లి అరెస్టులు చేయడం వెనుక ప్రభుత్వ భయాందోళన స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎలాంటి ఆందోళనకు పిలుపు ఇవ్వకపోయినా అరెస్టులు చేయడం పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని చాటుతోందని అన్నారు.విద్యార్థుల…
