రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీఈజేఏసీ)తో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఉద్యోగ సంఘాలు ప్రధానంగా ప్రస్తావించిన డీఏలు, పీఆర్‌సీ, పెండింగ్‌ బిల్లులు, సీపీఎస్‌ తదితర అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దసరా పండుగలోపు రెండు డీఏలు విడుదల చేసేందుకు...

తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం రెండు డీఏలు విడుదల చేసేందుకు అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. సీఎస్‌ సంజయ్‌ జాజుతో జరిగిన చర్చల్లో మొదటి డీఏను 3.46 శాతం, రెండో డీఏను 2.74 శాతంగా ప్రకటించినట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న...

సీఎంతో TGEJAC నేతల భేటీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) నాయకులకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో బుధవారం రాత్రి 9 గంటలకు TGEJAC నేతలు సమావేశం కానున్నారు. ఉద్యోగుల సమస్యలు, పెండింగ్‌ డిమాండ్లు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై ఈ...

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యం

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ సాధ్యంఅయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి . పి. లక్ష్మి సౌజన్య జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 23 : ఆయుర్వేద వైద్య విధానంతో అనేక రకాల అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన చికిత్స అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి . పి. లక్ష్మి సౌజన్య అన్నారు. బుధవారం 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని అయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత మెగా వైద్య…

కొట్రలో కలకలం.. 8 ఏళ్ళ బాలుడు అదృశ్యం

వెల్దండ: బీహార్‌కు చెందిన గౌతమ్ సింగ్, సావిత్రి దేవి దంపతులు గత 8 నెలలుగా వెల్దండ మండలం కొట్ర తండాకు చెందిన నేనావత్ సోములు ఆవుల షెడ్డులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం.వారి పెద్ద కుమారుడు ఆర్యన్ (8) కొట్ర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వారు నివసిస్తున్న ఇంటి వద్ద నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు.బాలుడి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే…

ఆదివారం పనిచేయనున్న బ్యాంకులు

నాగర్ కర్నూల్:బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27న ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేయనున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖాతాదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ఏటీఎం అనుసంధానిత శాఖలు, కరెన్సీ చెస్టులు ఆదివారం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు ఆర్బీఐ అనుమతి ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగుల అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం

నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగుల అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు. వివిధ శాఖల్లో విశిష్ట సేవలందించిన ఉద్యోగులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వివరాలకు జిల్లా కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ.. వెల్దండలో ఉచిత వైద్య శిబిరం

వెల్దండ: 11వ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని వెల్దండలోని ఆయుర్వేద వైద్యశాలలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యం ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.వైద్య శిబిరంలో చిన్న పిల్లలకు మరియు వృద్దులకు ప్రత్యేక చొరవతో మందులు పంపిణీ చేశారు.ఇందులో 150 మందికి ఉచిత మందులు అందజేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ జె. చంద్రసింగ్, డాక్టర్ సింధు మురళి, యోగా శిక్షకులు బీరయ్య, మల్లయ్య,…

సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

సమతుల్య ఆహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం, శారీరక అభివృద్ధి సాధ్యమని సూపర్వైజర్ శ్రీదేవి అన్నారు. పెద్దమడూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. రోజువారీ ఆహారంలో బియ్యం, గోధుమలు, పప్పులు, గుడ్లు, పాలు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, విటమిన్లు, మినరల్స్‌ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నెయ్యి, నూనె వంటి కొవ్వు పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధిక, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది, హెల్పర్లు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.

ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి సర్పంచ్ ధన్సింగ్ నాయక్ నాయక్ రూ.10 వేల విరాళం

వెల్దండ మండలం: నగరగడ్డ తండా గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ ఆలయ నిర్మాణానికి బోలిగుట్ట తండాకు చెందిన చెదురుపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ వడ్త్యవత్ ధన్ సింగ్ రూ.10 వేల విరాళాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందించిన ధన్ సింగ్‌ను పలువురు అభినందించారు.ఈ కార్యక్రమంలో రాత్లావత్ వస్య, లాలు, మణిపాల్, శ్రీను, నరేష్, గోపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.