పాలకుర్తిలో ఘనంగా మట్టి గణపతి నిమజ్జనం
ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పర్యావరణహితంగా ప్రతిష్ఠించిన మట్టి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, డప్పు వాయిద్యాలు, భజనలు, గణపతి నామస్మరణల మధ్య శోభాయాత్రగా నిమజ్జనం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని “గణపతి బప్పా మోరియా” నినాదాలతో సందడి చేశారు. మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలని ఝాన్సీ రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
