సూర్యాపేట నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో 13 మంది విద్యార్థినులు అస్వస్థత

సూర్యాపేట నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో 13 మంది విద్యార్థినులు అస్వస్థత
సూర్యాపేట: సూర్యాపేట ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అనుమానంతో 13 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినులను చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. కాగా, గత కొద్దిరోజులుగా పలువురు విద్యార్థినులు విషజ్వరాలతో బాధపడుతూ హాస్టల్‌ను వీడి వెళ్లినా, హాస్టల్ యాజమాన్యం, సిబ్బంది సరైన చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆరోపించారు.
హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, విద్యార్థినుల ఆరోగ్య భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

You may also like...