బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

- కోటగిరి లో రైతుల భారీ ర్యాలీ
- సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, కోటగిరి:
కోటగిరి మండల కేంద్రంలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో రైతుల ధర్నా నిర్వహించారు, తాసిల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అనంతరం తాసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ నాయకుని మాటలకు తందాన అనడం మానాలని, వాస్తవానికి గుర్తించి రైతుల పక్షాన మాట్లాడవలసింది పోయి, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక సమావేశం పెట్టడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు, రక్తం ఇవ్వడానికి సిద్ధం, ప్రాణానికి ప్రాణమైన రైతుల పట్ల ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని రైతులను కాపాడటమే మా అధినేత కెసిఆర్ లక్ష్యమని, దానికి అనుగుణంగా కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేస్తే రైతన్నకు లాభం చేకూరుతుందని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి పెడదోవ పడుతున్నారని, రైతులను కాపాడటానికి, మా రక్తానైనా చిందిస్తామని , మరల అధికారంలోకి రాగానే కాలేశ్వరం నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు ఎలమంచిలి శ్రీనివాసరావు, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, తెల్ల రవికుమార్, మోరే కిషన్, సమీర్, నవీన్, ఏజాస్, రసూల్ , రత్నాకర్, అంజిరెడ్డి, అరవింద్, గంగా ప్రసాద్ గౌడ్ , తదితరులు పాల్గొన్నారు

