జూలై 17న విడుదల కానున్న ‘వదలా’
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

సీనియర్ నటులు జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అకెళ్ల వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ యువతి వ్యామోహం నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత కథతో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, హృతిక శ్రీనివాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. చరిత చిత్ర ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రానికి చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ, కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు.
