స్క్రాప్ దుకాణంలో పేలుడు.. ఒకరికి గాయాలు
- బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత భార్గవ్ దేశ్పాండే - October 25, 2026
- చేవెళ్ల మున్సిపాలిటీలో ముసలం.. - October 25, 2026
- వృద్ధాప్యంలో గుండె లయపై నిర్లక్ష్యం వద్దు! - October 25, 2026

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:
నగరంలోని రామంతపూర్ చర్చి కాలనీలో స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభవించడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డారు. పేలుడు ధాటికి కాలిన గాయాలైన బాధితుడు దుకాణం నుంచి బయటకు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
