రిపోర్టర్, కామారెడ్డి | 9989390343
Latest posts by Kethavath Permal
(see all) 
బాన్సువాడ ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల వెలుగులో తొలి నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ఏజాజ్, కాసుల రోహిత్, కౌన్సిలర్ ఎం.ఏ. హకీం కేక్ కట్ చేసి టోర్నీని ప్రారంభించారు.ప్రారంభ మ్యాచ్‌లో ప్రెస్, పోలీస్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. తొలుత పోలీస్ జట్టు 7 ఓవర్లలో 70 పరుగులు చేయగా, ప్రెస్ జట్టు కూడా 70 పరుగులు చేసి మ్యాచ్‌ను టై చేసింది. రెండు సూపర్ ఓవర్ల అనంతరం ప్రెస్ జట్టు విజయం సాధించింది. నమస్తే తెలంగాణ రిపోర్టర్ వై. ఆనంద్ మూడు వికెట్లు తీసి, 25 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఏ1 ఫుట్‌వేర్ స్పోర్ట్స్ షూస్‌ను బహూకరించింది.మొత్తం 36 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో విజేతకు రూ.20 వేలు, రన్నరప్‌కు రూ.10 వేల నగదు బహుమతి అందించనున్నారు. నిర్వాహకులు ఖుద్దూస్, ఆఫ్రోజ్, లాలా, ఇమ్రాన్, ఖాలేద్, ఏక్బాల్ టోర్నీ ఏర్పాట్లు చేశారు.