ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు అవగాహన సదస్సు

1001295805.jpg

వెల్దండ: మండలంలో ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన సదస్సును నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యుడు దొబ్బల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పుట్ట రాంరెడ్డి మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నిరంజన్, అశోక్, శేఖర్‌తో పాటు ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ సభ్యులు బండగల్ల చందు, కొమ్ము కిరణ్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...