కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగిళ్ల శివరాజ్
- పట్టభద్రులంతా ఓటు నమోదు ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి.. శ్రీనివాస్ చారి - October 24, 2026
- కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగిళ్ల శివరాజ్ - October 24, 2026
- ఆర్ఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు అవగాహన సదస్సు - October 24, 2026

వెల్దండ అక్టోబర్ 24 :బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బీఆర్ఎస్వీ వెల్దండ మండల అధ్యక్షుడు నాగిళ్ల శివరాజ్ శనివారం తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించినట్లు నాగిళ్ల శివరాజ్ తెలిపారు.
