వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డు
- పోలీసులంటే భయం కాదు.. భరోసా : కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ - October 24, 2026
- వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డు - October 24, 2026
- ఘనంగా కనకదుర్గాదేవి శోభాయాత్ర - October 21, 2026
వంగూరి లక్ష్మయ్యకు ప్లాటినం ఐకాన్ అవార్డు
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 23: హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా అయ్యప్ప తత్వాన్ని ప్రచారం చేస్తున్న కట్టంగూర్ శ్రీ సాయి మణికంఠ దేవాలయ గురుస్వామి వంగూరి లక్ష్మయ్య (పూల స్వామి) ప్లాటినం ఐకాన్ అవార్డుకు ఎంపికయ్యారు. హైదరాబాదుకు చెందిన ఉజ్వల శిఖరం ఆర్ట్ థియేటర్ సాంస్కృతిక సంస్థ గత తొమ్మిదేళ్లుగా ఆధ్యాత్మిక , కళా రంగాలలో కృషి చేస్తున్న పలువురు ప్రముఖులను గుర్తించి ప్రతి ఏటా ఐకాన్ అవార్డులను ప్రదానం చేస్తుంది. 2026 సంవత్సరానికి గాను కళా,ఆధ్యాత్మిక రంగంలో విశేష సేవలు అందించిన 19 మందికి అవార్డులను ప్రధానం చేయనుంది. ఈనెల 27న దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు సంస్థ ఫౌండర్ ఎం లక్ష్మీ తెలిపారు. అవార్డు కు ఎంపికైన పూల స్వామి మాట్లాడుతూ తన సేవను గుర్తించి అవార్డుకు ఎంపిక చేసిన ఉజ్వల సంస్థ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డును కిరీటంలా భావించకుండా మరింత భక్తి భావంతో ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
