బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. పంచాయతీ కార్యదర్శికి తీవ్ర గాయాలు

ఆమనగల్లు: ఖానాపూర్‌ పలుగుగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్జాల్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి వాజీద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు నుంచి వెల్జాల్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజీద్‌కు తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వాజీద్‌ను ఎన్నం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.1001293260.jpg

You may also like...