బొల్లంపల్లి కొత్తచెరువులో మునిగి గొర్రెల కాపరి మృతి

1001291371.jpg

వెల్దండ, అక్టోబర్ 22: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కానుగట్టు తండాకు చెందిన కేతావత్ గన్యా నాయక్ (58) గురువారం బొల్లంపల్లి కొత్తచెరువులో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్న గన్యా నాయక్ ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య ఆందోళన చెంది కేకలు వేసింది. దీంతో అక్కడికి చేరుకున్న స్థానికులు చెరువులో గాలించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆయన మృతితో కానుగట్టు తండాలో విషాదం నెలకొంది.

You may also like...