చీమలదరిలో ఘనంగా దుర్గామాత నిమజ్జన వేడుకలు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా మోమిన్ పేట్ మండలం చీమలదరి గ్రామంలో బుధవారం నాడు  జై గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా నిర్వహించారు. అమ్మవారి నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుతూ భజన పాటలతో, డీజే పాటలతో, నృత్య ప్రదర్శన తో, మహిళలు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు వీధులలో ఊరేగింపుగా డప్పుచప్పళ్ళు,, నృత్యాలతో అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేశారు . అమ్మవారి ఆశిష్యులు ఎల్లవేళల ఉండాలని ప్రార్థించారు.

You may also like...