చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
- జనగామ బీరప్పగడ్డలో అంగరంగ వైభవంగా దుర్గమ్మ నిమజ్జనం - October 22, 2026
- చిన్న రాంచర్లలో దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి - October 22, 2026
- పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు - October 22, 2026
జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట మండలం చిన్న రాంచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.
