సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి భూమి పూజ

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి భూమి పూజ

విగ్రహాన్ని సొంత ఖర్చులతో అందిస్తానని ప్రకటించిన డా. తండు సైదులు గౌడ్

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 15 : మండలంలోని పామనగుండ్ల గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు గురువారం భూమి పూజ నిర్వహించారు. గ్రామ గౌడ కులస్తుల ఆహ్వానం మేరకు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ జెడ్పీటీసీ, చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్ భూమి పూజలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో అందజేస్తానని డా. తండు సైదులు గౌడ్ ప్రకటించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వడ్డే మాధవిసైదిరెడ్డి, ఉపసర్పంచ్ బండారు నవనీతకృష్ణ, తండు శంకర్, గౌడ కుల పెద్దలు, గౌడ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1000378416.jpg

You may also like...