కల్వకుంట్ల కవిత, సర్వేష్ ముదిరాజ్ సమక్షంలో శబరిమల పోస్టర్ ఆవిష్కరణ
- కల్వకుంట్ల కవిత, సర్వేష్ ముదిరాజ్ సమక్షంలో శబరిమల పోస్టర్ ఆవిష్కరణ - October 19, 2026
- అత్యంత కీలకమైన 8 నెలలు: తాగునీటి పొదుపుపై జలమండలి ఫోకస్. - October 19, 2026
- సేఫర్ స్ట్రీట్స్ బెటర్ కనెక్టివిటీ సైబరాబాద్ అర్బన్ మొబిలిటీలో సరికొత్త మార్పులు. - October 19, 2026

హైదరాబాద్: జియ్యగూడకు చెందిన బసవేశ్వర్ ముదిరాజ్ గురుస్వామి బృందం (చిన్ముద్ర శబరిమల మహా పాదయాత్ర సేవా సమితి) ఆధ్వర్యంలో చేపట్టనున్న శబరిమల మహా పాదయాత్రకు సంబంధించిన అధికారిక పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితమ్మ మరియు నీరుడు సర్వేష్ ముదిరాజ్ బుధవారం (అక్టోబర్ 14, 2026) ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరించిన వారిలో పాతర్ల దశరథ్ ముదిరాజ్, చేవెళ్ల శ్రీకాంత్, టిల్లు, ప్రవీణ్ నాయక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వర్ గురుస్వామి బృందం మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రతి ఏటా లాగే ఈసారి కూడా శబరిమల మహా పాదయాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో, విజయవంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులందరూ ఈ పాదయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
