నిరుద్యోగులకు శుభవార్త – సుంకిరెడ్డి జాబ్ డ్రైవ్ కు భారీ స్పందన.!

కల్వకుర్తి 10: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ డ్రైవ్‌లు కొనసాగుతాయని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో జరిగిన జాబ్ డ్రైవ్ ఇంటర్వ్యూలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూకు కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 35 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. వెల్దండ నుంచి 11, కల్వకుర్తి నుంచి 7, ఆమనగల్ నుంచి 16, తలకొండపల్లి నుంచి 1 మంది హాజరయ్యారు.ప్రతి ఉద్యోగ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు ఉపాధి కల్పించి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వడమే తన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వీర, మహేష్, ఐక్యత ఫౌండేషన్ సభ్యుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

You may also like...