బోనాలు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలి.. ఎస్సై యుగంధర్ రెడ్డి
- బోనాలు భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలి.. ఎస్సై యుగంధర్ రెడ్డి - September 8, 2026
- అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం.. తహసిల్దార్ కార్తీక్ కుమార్ - September 8, 2026
- పోచమ్మ బోనాలు విజయవంతం చేయండి.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - September 8, 2026
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వద్దు ఎస్సై యుగంధర్ రెడ్డి
వెల్దండ సెప్టెంబర్ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి తో పాటు వివిధ గ్రామాల బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వెల్దండ ఎస్ఐ యుగేందర్ రెడ్డి తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు, ఆలయ కమిటీలు, యువకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, భక్తి గీతాలను మాత్రమే తక్కువ శబ్దంతో వినిపించాలన్నారు.మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయాల వద్ద గట్టి బందోబస్తు, సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని తెలిపారు.
