కంటోని పల్లిలో అంబరాన్ని తాకిన “జైశ్రీరామ్ నినాదాలు”
- నాగర్ కర్నూలు జిల్లాలో 255 అంగన్వాడీ పోస్టులు ఖాళీ - September 8, 2026
- కంటోని పల్లిలో అంబరాన్ని తాకిన “జైశ్రీరామ్ నినాదాలు” - September 8, 2026
- మట్టి గణపతులనే పూజించండి బీజేలకు నో పర్మిషన్.. ఎస్సై కురుమూర్తి - September 8, 2026
వెల్దండ సెప్టెంబర్ 07: వెల్దండ మండలంలోని కంటోనీపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి శోభాయాత్ర కనులపండువగా జరిగింది. గ్రామ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన వీధుల మీదుగా సాగింది.కాషాయ కండువాలు ధరించిన యువకులు, భక్తులు 'జై శ్రీరామ్, జై హనుమాన్' నినాదాలతో హోరెత్తించారు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని భుజాలపై మోస్తూ భక్తి శ్రద్ధలతో ఊరేగించారు.గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివ మధుసూదన్,రవి,సురేష్, బాలస్వామి, ఆకుల శ్రీను తో పాటు గ్రామ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, భక్త బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.
