ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మి
- ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మి - September 8, 2026
- 420 హామీలు.. 13 డిక్లరేషన్లు.. 6 గ్యారెంటీలు అమలు చేయాలి మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు - September 7, 2026
- డిజిటల్ క్రాప్ సర్వేకు రైతులు సహకరించాలి - September 7, 2026
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 7 : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్ల మండల యూనియన్ అధ్యక్షురాలు చౌగోని ధనలక్ష్మి అన్నారు. సమస్యలు పరిష్కరించాలని సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి జమునకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశలకు కనీస వేతనం రూ.18 వేలుగా నిర్ణయించి పని భారం తగ్గించి పెండింగ్ పారితోషికాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ఛలో అసెంబ్లీ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఆశ వర్కర్లు రేణుక, సంతోష్, సుజాత, మంగమ్మ, భారతి, పార్వతమ్మ, సునీత, సంధ్య ఉన్నారు.
