ఆలయ అభివృద్ధికి సుంకిరెడ్డి రూ. లక్ష 70 వేల విరాళం
- ఉప్పల వెంకటేష్ పిలుపుతో బండోనిపల్లిలో కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు - September 7, 2026
- కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ప్రజాదారణ - September 7, 2026
- మృతురాలి కుటుంబానికి భాస్కరరావు ఆర్థిక సహాయం - September 7, 2026
కల్వకుర్తి సెప్టెంబర్ 06: తలకొండపల్లి మండలం చుక్కపూర్ ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు,టాస్క్ సి.ఓ.ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన కోసం రూ.1లక్ష డెబ్భై వేల రూపాయల చెక్కును ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మకు అందజేశారు.అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు.గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న కర్రోలి దశరథం ను పరామర్శించారు.ఈ కార్యక్రమాలలో
సర్పంచ్ మాకం వీరేష లింగం, ఉప సర్పంచ్ లావణ్య శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి దాసరి యాదయ్య, సీనియర్ నాయకులు కాగుల కుమార్,నరసింహ, యాదయ్య. లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
