పీహెచ్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి : గౌరవ్ ఉప్పల్
- పీహెచ్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి : గౌరవ్ ఉప్పల్ - September 6, 2026
- హైవే పక్కన వాహనాల నిలిపివేత మృత్యుశకటాలుగా మారుతున్న రహదారులు అక్రమ పార్కింగ్తో ప్రాణాలకు ముప్పు - August 30, 2026
- మెరుగైన బోధనకు కాంప్లెక్స్ సమావేశాలు దోహదం : పాఠశాల విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎం. సోమిరెడ్డి - August 29, 2026
పీహెచ్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి : గౌరవ్ ఉప్పల్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 5 :కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆర్ధిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీ ఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్ శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్, డీఎంహెచ్ రాహుల్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది పనితీరుపై ఆరా తీసి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, రోగులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యాధికారి జమునను ఆదేశించారు
.
