జెన్-జీతో పెట్టుకుంటే మోదీకే చెమటలు పట్టినయి.. రేవంత్‌రెడ్డి లాంటి కేడీ ఎంత? -కేటీఆర్
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

జెన్-జీ యువతతో పెట్టుకున్న పోరులోనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెమటలు పట్టాయని, అలాంటిది తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న రేవంత్‌రెడ్డి లాంటి కేడీ ఎంత అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యువత ప్రశ్నిస్తే అధికార అహంకారం బట్టబయలవుతుందని అన్నారు. హామీలను తుంగలో తొక్కి, నిరుద్యోగులు, విద్యార్థులు, యువతను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. ప్రజాగ్రహాన్ని అణచివేయాలనే కుటిల ప్రయత్నాలు చేస్తే మరింత తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. అధికార మదంతో విర్రవీగుతున్న పాలకులకు జెన్-జీ శక్తి ఏమిటో రాబోయే రోజుల్లో తెలుస్తుందని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
