ఉద్యోగుల జీవితాలకు భద్రత భరోసా పాత పెన్షన్

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (cps) విధానాన్ని రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీ మ్ (ops)విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఈరోజు ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ తెలంగాణ రాష్ట్రం మహాధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ హైదరాబాద్ లో విజయవంతంగా చేపట్టడం జరిగింది.

ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (OPS) ను పునరుద్ధరించాలనీ పీ ఆర్ టీ యూ షాబాద్ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు డేవిడ్ రెడ్డి మరియు బీరపోల్ల క్రిష్ణయ్య ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
CPS విధానంలో పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు లభించే పెన్షన్ మొత్తం మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడుల రాబడిపై ఆధారపడి ఉండటంతో వారి భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొని ఉందనీ,
OPS విధానంలో ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం నిర్ధిష్ట పెన్షన్ లభించడం వల్ల వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత ఉంటుందనీ. అలాగే కుటుంబ పెన్షన్, వైద్య ఖర్చులు మరియు ఇతర అవసరాలను సులభంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుందనీ వారు తెలపడం జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగులు తమ సేవా కాలమంతా ప్రజలకు, ప్రభుత్వానికి అంకితభావంతో పనిచేస్తున్నారనీ అందువల్ల వారి పదవీ విరమణ జీవితానికి ఆర్థిక భద్రత, గౌరవప్రదమైన జీవనం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేయడం జరిగింది.
ఉద్యోగుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని CPS విధానాన్ని వెంటనే రద్దు చేసి,OPS విధానాన్ని అమలు చేయడం ద్వారా ఉద్యోగుల్లో విశ్వాసం, భద్రతా భావం పెంపొందుతుందని,కాబట్టి ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ CPSను రద్దు చేసి, OPSను అమలు చేయాలని ఈరోజు పీ ఆర్ టీ యూ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు హైదరాబాదులోని ఇందిరా పార్క్ దగ్గర మహధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు షాబాద్ మండలం నుండి అనేక మంది ఉపాధ్యాయులు పాల్గొని పాత పెన్షన్ విద్రోహక దినానికి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో షాబాద్ మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు డేవిడ్ రెడ్డి,బీరపోల్ల క్రిష్ణయ్య,గౌరవ అధ్యక్షులు అంజయ్య, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎల్ నరసింహులు, రాష్ట్ర మహిళ అసోసియేట్ అధ్యక్షరాలు సుశీలక్క,జిల్లా బాధ్యులు శ్రీనివాస్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మర్పల్లి అశోక్, జైపాల్ రెడ్డి, కాజా పాషా, కే నర్సింలు,బి నర్సింలు, సంజీవ్ కుమార్,టీ జయరాజు, వెంకటరమణ గౌడ్,మండల బాధ్యులు విజయలక్ష్మి, గోవిందు, యాదయ్య, రాజేంద్రప్రసాద్, రామచంద్రయ్య,హేమ సుందర్, రవి నాయుడు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

You may also like...