- ఉద్యోగుల జీవితాలకు భద్రత భరోసా పాత పెన్షన్ - September 1, 2026
- ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లపై ప్రభుత్వానికి వినతి - September 1, 2026
- రేవంత్ ఆదేశాల అమలులో డీజీపీ సెంచరీ: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,మాజీ ఐపిఎస్ - September 1, 2026
రేవంత్ రెడ్డి బజారు భాషపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

అంబర్పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి బజారు భాష మాట్లాడారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో అవరోధాలను ఎదుర్కొని, అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడి పోరాడిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ పాలిట కేసీఆర్ నంది లాంటి వారని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నేతల చేతిలో తెలంగాణ బందీగా మారిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతూ, వారు పందులా, పందికొక్కులా అనేది ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి నుంచి ప్రజలు నిజాలను ఆశించడం ఎప్పుడో మానేశారని వ్యాఖ్యానించారు.
గతంలో ప్రజలు తన చేతిలో మోసపోవాలని కోరుకుంటారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తుచేశారు. మాటలకు, చేతలకు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలే తమ తీర్పుతో సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ప్రజలు సహించబోరని, రాజకీయ విమర్శలకు కూడా ఒక హద్దు ఉండాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఇవ్వడం పాలకుల వైఫల్యాన్ని బయటపెడుతోందని విమర్శించారు.
