సింగపూర్‌లో యూనిఫాంలు, వర్క్‌బుక్స్ పంపిణీ

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సింగపూర్‌లో విద్యార్థులకు యూనిఫాంలు, ప్రీ-ప్రైమరీ చిన్నారులకు వర్క్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ రావు ఎర్ర, 9వ వార్డు కౌన్సిలర్ గణేష్, 10వ వార్డు కౌన్సిలర్ రాజన్ల వసంత మహేందర్ రెడ్డి, గౌరవ మాజీ కౌన్సిలర్ మడపతి చంద్రమౌళి పాల్గొని విద్యార్థులను అభినందించారు.
ఎంపీపీఎస్ సింగపూర్‌లో విద్యార్థులకు యూనిఫాంలు అందజేయగా, ప్రీ-ప్రైమరీ సెక్షన్‌లో చిన్నారులకు వర్క్‌బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం వారి అభ్యసనలో మరింత ఆసక్తిని పెంచుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. చిన్నారుల ప్రాథమిక విద్యకు వర్క్‌బుక్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు కే. వాసంతి దేవి, ప్రీ-ప్రైమరీ సెక్షన్ ఉపాధ్యాయురాలు నందిని, అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ సభ్యులు లక్ష్మీ, ఇతర ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

You may also like...