నేడే పూర్వ వీఆర్వో, వీఆర్ఏల సర్టిఫికెట్ల పరిశిలన
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్ఏల సర్టిఫికెట్ల పరిశిలన
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ వీఆర్వో, వీఆర్ఏల సర్టిఫికెట్ల పరిశీలనను రెవెన్యూ శాఖ చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా.. సర్వీసు అంశంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో గడువును 26 వరకు పొడిగించాలని ఆదేశించింది. మొత్తం 6,196 దరఖాస్తులు అందినట్లు సమాచారం. వీటిలో అర్హులను గుర్తించేందుకు ధ్రువపత్రాలను పరిశీలిస్తున్నారు.
