భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత.. పలువురు బీజేపీ నేతల అరెస్ట్
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

వరంగల్: భద్రకాళి ఆలయం వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తడిబట్టలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఆలయంలోకి ప్రవేశించారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆలయ ఆచారాలు, సంప్రదాయాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జోక్యం చేసుకుని పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఆలయ సంప్రదాయాలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు భద్రకాళి ఆలయ పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు
