మహాలింగాపురం గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

మహాలింగాపురం గ్రామంలో ఘనంగా అయ్యప్ప పడిపూజ
- భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
- అయ్యప్ప స్వామి నామస్మరణతో గ్రామముంతా భక్తిమయం
- గణపతి, కుమార స్వామి విగ్రహలను ప్రతిష్టించి పూజలు
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప మాలధారణ స్వాములు
- అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
శంకర్పల్లి మండల పరిధిలోని మహాలింగాపురం గ్రామంలో శుక్రవారం అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా జరిగింది. స్వామియే శరణం అయ్యప్ప శరణం.. శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో గ్రామమంతా మారుమోగింది. శబరిమలై సన్నిధిని తలపించేలా ప్రత్యేక అలంకరణ చేశారు. అష్టాదశ కలశాలతో అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం చేసి కనుల పండుగగా అయ్యప్ప మహా పడి పూజను నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 18 మెట్ల పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి మహా శివుని అయ్యప్ప, గణపతి, కుమార స్వామి విగ్రహలను ప్రతిష్టించి పూజలు చేశారు. పడి పూజకు గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన అయ్యప్ప మాలధారణ స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అయ్యప్పకు అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
