సూర్యాపేట లో భారీ చేరికలు

బి.ఎస్.పి లో యువత చేరికలు

చివ్వెంల మండలం జువి చెట్టు తండా నుంచి చేరిక

ఎనిమిదో(8) వార్డు నల్లచెరువు తండా నుంచి 40 మంది చేరిక

సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం జువ్వి చెట్టు తండాకు చెందిన 50 మంది యువకులు, సూర్యాపేట పట్టణంలోని ఎనిమిదో వార్డు పరిధిలో ఉన్న నల్ల చెరువు తండాకు చెందిన 40 మంది యువకులు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి వారం పార్టీ కార్యాలయంలో బీఎస్పీ పార్టీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా జానయ్య యాదవ్ గారు మాట్లాడుతూ ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఒక్కరూ గ్రామాలలో,పట్టణంలో ప్రజలను చైతన్యులను చేసి బహుజన పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ ధరావత్ నీలాబాయి లింగా నాయక్, తుమ్మల పెన్పహాడ్ ఎంపీటీసీ ఉప్పుల మల్లయ్య,మైనార్టీ సెల్ అధ్యక్షులు చాంద్ పాషా,సూర్యాపేట పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షులు మీర్ అక్బర్,బొల్లే సైదులు, భారీ అశోక్, వట్యాల శేఖర్ తదితరున్నారు.

జువి చెట్టు తండా నుంచి పార్టీలో చేరిన వారిలో. శ్రీను, రమేష్, చాంప్ల, ఏలేందర్, వీరు, లింగ, రవి, మైసూర్, సుమన్, వీరన్న, హుస్సేన్, లాలు, చాంప్ల ఎల్లయ్య, సాయి తదితరులున్నారు.

నల్ల చెరువు తండా నుంచి
పార్టీలో చేరిన వారిలో ధరావత్ రాము, వెంకటేష్, సురేష్, నిరంజన్, నాగరాజు, గోపి, నగేష్, సైదులు, శ్రీను, ఆశయ్య, పవన్ తదితరులున్నారు

You may also like...

Translate »